Telangana | భారీ కేటాయింపులు

Telangana | భారీ కేటాయింపులు

Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27 ముఖ్యాంశాలు
సంక్షేమ పథకాలపై భారీ కేటాయింపులు
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత
కొత్త పథకాల ప్రకటనలు – కీలక నిర్ణయాలు
రుణాలు, ఖర్చులపై విశ్లేషణ

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ 3,24,234 కోట్లతో భారీ బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని మల్లు భట్టి తెలిపారు. అటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఇటు మౌలిక వసతుల కల్పన ద్వారా దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు వేయడం ఈ బడ్జెట్ లోని ప్రధానాంశం కావడం విశేషం. శాసనమండలిలో మంత్రి ఉత్మమ్ కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Telangana

2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పూర్తి వివరాలు

మొత్తం బడ్జెట్ 3,24,234

  • 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు
  • జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు.
  • ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన
  • ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు అల్పాహారం
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం
  • ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌ కార్డు
  • ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం
  • రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన
  • వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు
  • విద్యుత్‌ శాఖకు రూ.21,285 కోట్లు
  • ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు
  • విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
  • రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు
  • చేయూత పథకం.. రూ.14,861 కోట్లు
  • వైద్య శాఖకు రూ.13,679 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
  • బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు
  • మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు
  • కల్యాణ లక్ష్మీ పథకం.. రూ.3,683 కోట్లు
  • ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు
  • రాజీవ్‌ ఆరోగ్యశ్రీ.. రూ.1143 కోట్లు
  • గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు
  • వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌.. రూ.3500 కోట్లు
  • మహాలక్ష్మీ పథకం.. రూ.4,305 కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5,500 కోట్లు
  • పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు
  • యంగ్‌ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు
  • మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌.. రూ.1500 కోట్లు
  • ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు
  • మెట్రో రైలు ఫేజ్‌-2.. రూ.600 కోట్లు
  • మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ పథకం.. రూ.723 కోట్లు
  • పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు
  • కార్మిక శాఖకు రూ.998 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశంలో నూతన పథకాలను ప్రవేశ పెట్టింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, జూన్‌ 2 నుంచి అమలు కానుంది. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రకటించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు అల్పాహారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులను మంజూర్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.