ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి…

ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి…

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : వేసవి ప్రారంభంలోనే ఎండలు అధికంగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటడం వలన ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని నారాయణపురం మండల సీపీఐ పార్టీ డిమాండ్ చేశారు.మండలంలోని లచ్చమ్మ గూడెం, చిల్లాపురం గ్రామాలలో ఎండిపోయిన వరి చేనులను సీపీఐ పార్టీ నాయకులు పరిశీలించారు.

పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, బచ్చన గోని గాలయ్య, కురుమిద్దే శ్రీనివాస్, పల్లె మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply