ఉగాది పండగ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..

ఉగాది పండగ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఉగాది వేడుకలను రాష్ట్రంలో నే వినూత్నంగా యాదాద్రి భువనగిరి మోత్కూర్ లోని ప్రజలు జరుపుకుంటారు.రాష్ట్రం అంతటా వెజ్ ఉగాది కొనసాగితే..మోత్కూర్ లో మాత్రం అందుకు విరుద్ధంగా నాన్ వెజ్ ఉగాది వేడుకలు జోరుగా జరుగుతాయి.ఈ సందర్భంగా మహిళలు ముత్యలమ్మ అమ్మ వారికి భోనాలు,హై స్కూల్ లో ఎడ్లబండ్ల,బైక్,కార్లు,లారీలు,ట్రాక్టర్ ల ప్రదర్శన లు ఇలా అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు మోత్కూర్ లో ఘనంగా జరుగుతాయి.బుధవారం స్థానిక తూర్పు, పడమటి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాల వద్ద ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య లు స్వయంగా పరిశీలించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ సతీష్ కి సూచించారు. మోత్కూర్ లో అతి పెద్ద పండుగ సందర్బంగా ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండగ జరుపుకోవాలని చైర్మన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలకు,అధికారులకు,ప్రజాప్రతినిధులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply