ఏపీఓ భాస్కర్ కు కళాకారుల సన్మానం..

ఏపీఓ భాస్కర్ కు కళాకారుల సన్మానం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ పి వి టి జి ఏపీఓగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఆత్రం భాస్కర్ కు బుధవారం ఐటీడీఏ లోని తన కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం టీం లీడర్ చహకటి రవీందర్, కళాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీవో భాస్కర్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిక సాగదు అదిలాబాద్ జిల్లా బృందం టీం లీడర్ చహకటి రవీందర్, కళాకారులు ఆత్రం గోవింద్ రావు,గోడం ఆశిష్, గుంజాల రమేష్, గట్టు వెంకట్ రావు, రాథోడ్ శంకర్, మెస్రం మురళి, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.