ఇంటర్ విద్యార్థి షేక్ సల్మాన్ అదృశ్యం..

ఇంటర్ విద్యార్థి షేక్ సల్మాన్ అదృశ్యం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన షేక్ సల్మాన్ (17) ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన షేక్ సల్మాన్ ఈ నెల 17న ఉదయం ఇంటర్ పరీక్షలు రాసి స్నేహితులను కలసి వస్తానని చెప్పి వెళ్లాడు కానీ.. ఇంటికి రాలేదు.

దీంతో సల్మాన్ కోసం అతని తల్లిదండ్రులు.. బంధువుల ఇంటికి వెళ్లాడేమో అని ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో తమ కుమారుడు కనబడటం లేదని.. అతని తండ్రి షేక్ అమీర్ కడెం పోలీసు స్టేషన్ ఎస్ ఐ కు ఫిర్యాదు చేశారు. సల్మాన్ ను చూసినవారు సెల్ నెంబర్ 9063982853 కు సమాచారం అందించాలని షేక్ సల్మాన్ తండ్రి షేక్ అమీర్ పేర్కొన్నారు.