అందుకు.. వాకింగ్ ఎంతో దోహదపడుతుంది..

అందుకు.. వాకింగ్ ఎంతో దోహదపడుతుంది..

నిర్మల్ టౌన్ ఆంధ్రప్రభ : మానసిక ఒత్తిడి, దీర్ఘకాళిక వ్యాధుల బారి నుండి బయట పడేందుకు వాకింగ్ ఎంతో దోహదపడుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మార్నింగ్ వాక్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు వారితో కలిసి వాకింగ్ చేశారు. వారి అవసరాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాకింగ్ చేసే వారి సౌకర్యం కోసం వాకింగ్ ట్రాక్ వేయించడం, ఓపెన్ జిమ్ మెరుగుపర్చడం, సాయంత్రం వాకింగ్ చేసే వారికి ఇబ్బందులు కలుగకుండా లైటింగ్ ఏర్పాట్ల పై మున్సిపల్ పరంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

అలాగే క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు నిర్మల్ లో మరో మంచి స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కోరనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వాకింగ్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ఎస్పి, రాజు, లక్కాకుల హరీష్, శ్రీకాంత్ యాదవ్, రామ్ మహేష్, శివకుమార్, నవీన్, మాజీ కౌన్సిలర్ ధర్మాజీ శ్రీనివాస్, అయ్యాన పోశెట్టి, వాకింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply