బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు…
బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు…
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం, జూకల్, తిరుమలపూర్, మూడు గ్రామాల్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా ఆయా గ్రామాల సర్పంచులు తౌటం లక్ష్మి, ఎలగొండ సంధ్య, జన్నే సురేష్, ప్రధాన కార్యదర్శలు గా, అంగన్వాడి టీచర్లు, కమిటీ సభ్యులుగా పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామ పోలీసు అధికారి, పంచాయతి కార్యదర్శులు, ఎన్జీవో సిబ్బంది, కుల సంఘాల పెద్దలు ఉన్నారని తెలిపారు.
బాలల హక్కులను బాల్య వివాహం నిర్మూలనకు ఈ కమిటీలు తోడ్పడుతాయని ఐసిడిఎస్ చిట్యాల మండల సూపర్వైజర్ జయప్రద తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ రామ రఘుపతి, నాలుగో వార్డ్ సభ్యులు తౌటం నవీన్, పంచాయతీ కార్యదర్శు రవికుమార్, కానిస్టేబుల్ అస్లాం ,జిల్లా బాలల పరిరక్షణ విభాగపు సిబ్బంది కుమార్ , తిరుపతి , మండల ఇన్చార్జి కళావతి తదితరులు పాల్గొన్నారు.
