విహార యాత్రల్లో విద్యార్థులు..

విహార యాత్రల్లో విద్యార్థులు..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని దండేపల్లి కాంప్లెక్స్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది ప్రాథమిక పాఠశాల 140మంది విద్యార్థుల ను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంఘర్స్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో పురాతన పుణ్యక్షేత్రలైన తెలంగాణ అన్నవరంగా పిలువబడే దండేపల్లి మండలం గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి,జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మినరసింహ స్వామి, వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల ఆలయాల విహార యాత్రలకు విద్యార్థులను తీసుకుని వెళ్లారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రావు విద్యార్థుల కు ఒకొక్క పుణ్యక్షేత్రం గురించి విద్యార్థుల తెలిసేలా వాటి ప్రాధాన్యత ను తెలిజేశారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ సెక్రెటరీ బుచ్చన్న తో పాటు సి ఆర్పీ గరిగే నర్సయ్య, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply