కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో తల్లిని కోల్పోయిన చిన్నారుల కు అండగా ఉంటానని ఈరవత్రి అనిల్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు భీంగల్ ఒకటో వార్డు కు చెందిన మృతి చెందిన సూర భాగ్యలక్ష్మి కుమార్తెలకు రూ 25 వేయిల ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, చిన్నారుల భవిష్యత్తు కోసం చేయూత అందించిన మినిరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు బోదిరే స్వామి, ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ, నాగేంధ్రబాబు, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పర్శ అనంత్ రావు, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కౌన్సిలర్లు తోట సతీష్, అంజుమ్, మమరి సందీప్, నాయకులు సుంకరి సురేష్, సీహెచ్ గంగాధర్, కర్నె చిన్నగంగయ్య, మేకల శ్రీనివాస్, మొండి దినేష్, సూర సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply