రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్
పెద్దవంగర, ఆంధ్రప్రభ : రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పెద్దవంగర మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు, పేర్లు మార్పిడి చేసుకున్నవారు, డిజిటల్ సంతకం పూర్తయిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు పత్రంతో పాటు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్,బ్యాంక్ సేవింగ్ అకౌంట్ జతపరిచి సమీప రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు మార్చి 25 వ తేదీ వరకు అందజేయాలని తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారులైతే మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి స్వామి నాయక్ వివరించారు.
