కొత్త మద్ది పడగలో చలివేంద్రం ప్రారంభం
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని కొత్త మద్ది పడగ గ్రామంలో వేసవికాలం పురస్కరించుకొని కొత్త మద్దిపడగ జీపీ ఆధ్వర్యంలో జీపీ ప్రజలకు త్రాగునీరు అందించడానికి సోమవారం చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను కొత్తమద్దిపడగ గ్రామ సర్పంచ్ జడ లావణ్య ఉప సర్పంచ్ బండారి జనార్ధన్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త మద్దిపడగ జీపీ ప్రజలు సమీప గ్రామాల ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి సీహెచ్ పద్మ, జీపీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
