పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది
పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది
- మీదికొండలో పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం
- సర్పంచ్ జోగు సంపత్ కుమార్
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గ్రామం పరిశుభ్రంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్ట లేనిదని సర్పంచ్ జోగు సంపత్ కుమార్ కొనియాడారు. స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జోగు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులతో కలిసి పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం పారిశుధ్య కార్మికు లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, నిత్యావసర వస్తువులైన సబ్బులు, కొబ్బరి నూనె, షాంపూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగు సంపత్ కుమార్ మాట్లాడుతూ వీధుల్లో ఎక్కడా చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలి. పరిశుభ్రత అనేది కేవలం కార్మికుల బాధ్య త మాత్రమే కాకుండా ప్రతి గ్రామస్థుడి బాధ్యతని అన్నారు.
ప్రతి ఒక్క రూ గ్రామ పరిశుభ్రతకు భాగస్వాములు కావాలని కోరారు. అలాగే 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి పనులను మరింత వేగ వంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, ఉప సర్పంచ్ అలకుంట్ల శ్రీను, ఏఎన్ఎం కవిత, వార్డు సభ్యులు పొన్నం పారిజాతం, జోగు రాజేష్, ఆశావర్కర్లు, ఇతర వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
