తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం…

తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం…
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో నివసించే పనేటి శారద తన కుమారుడు సింహాద్రి @ నరసింహ (10 సంవత్సరాలు) ఈనెల 6న మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఈనెల 7న కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆమె అన్న కుమారుడు కొడండం విజయ్ (9 సంవత్సరాలు) కూడా ఇంటి నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి పిల్లలను వెతికే చర్యలు చేపట్టారు. అనంతరం దర్యాప్తు శోధన చర్యలలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న ఒక చెరువులో ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయని ఎస్ హెచ్ ఓ నరహరి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేర స్థలం వద్ద పరిస్థితులను బట్టి పిల్లలు బావిలో చేపలను పిల్లలు చేపలు పడుతూ ప్రమాదవశాత్తు జారీ చనిపోయినట్లుగా గుర్తించినట్లు తెలిపారు.
