ఇరు శాఖలు సమన్వయంతో నీటి ఎద్దడి లేకుండా చూడాలి

ఇరు శాఖలు సమన్వయంతో నీటి ఎద్దడి లేకుండా చూడాలి
అధికారులకు దిశా నిర్దేశం చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట
జుక్కల్, ఆంధ్రప్రభ : వేసవికాలం దృష్ట్యా,ఎండలు తీవ్రతరం కావడంతో ఆర్డబ్ల్యూఎస్,మిషన్ భగీరథ ఇరు శాఖలు సమన్వయంతో జుక్కల్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశించారు.ఇరు శాఖల అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నీటి ఎద్దడి ఉన్న గ్రామాల,తాండల వివరాలు అడిగి తెలుసుకున్నారు.చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రావడంలేదని,కొన్ని గ్రామంలో సక్రమంగా నిరంతరంగా నీటి లేదని తమకు గ్రామస్తులు వివరించడం జరిగిందని, కావున ముందస్తు చర్యలు చేపట్టాలని,పైప్ లైన్లో మరమ్మతులు ఉన్నగాని, విద్యుత్ చేడిపోతే వెంటనే యుద్ధ ప్రాతిపదికగా రిపేరు చేయించుకోవాలని,అస్సలు నీటి సరఫరాలేని ప్రాంతాలను గుర్తించి ప్రయత్నమ ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటి అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఏదైనా పెద్ద సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటికి నిధులు కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరుగుతుందన్నారు.ఏది ఏమైనా ఈ వేసవికాలంలో ఇరుశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో పాటు గ్రామాలలో నీటి సరఫరా లేదని ఫిర్యాదులు రాకుండా,ఇతర శాఖల అధికారులతో కూడా సంబంధాలు ఏర్పరచుకొని మంచి నీటి నివారణకు గట్టి చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రమేష్,గ్రీడ్ ఈఈ స్వప్న,ఇరు శాఖల అయ అధికారులు పాల్గొన్నారు.
