తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
బాసర, ఆంధ్ర ప్రభ : అర్జీయూకేటి యూనివర్సిటీ లో 2026-2027 మొదటి విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల నోటిఫికేషన్ శుక్రవారం యూనివర్సిటీ విసి గోవర్దన్ ఇతర అధికారుల తో కలిసి విడుదల చేసారు. ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్ https://www.rgukt.ac.in/ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. ఈ నెల 18 ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నమని దరఖాస్తులకు మే 10 చివరి రోజని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి. ప్రొఫెసర్ ఈ మురళి దర్శన్, అడ్మిషన్ కన్వీనర్ శీలం శేఖర్, కో- కన్వీనర్ బండి హరికృష్ణ, అసోసియేట్ డీన్స్ డా. మహేష్, డా. విటల్, డా. దేవరాజ్, సునీత తదితరులు పాల్గొన్నారు.
