విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ నాయకుల వినతి పత్రం
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని జనగామ జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనిస్, జిల్లా నాయకుడు పస్తం పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కింద సుమారు రూ.9,300 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయ ని పేర్కొన్నారు.
ఈ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని అన్నారు. తమ కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఫీజులు చెల్లిం చకపోవడంతో కొన్ని కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో ఉన్నత చదువులు కొనసాగించాలనుకునే వారు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు సమస్యలు ఎదు ర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరినట్లు తెలిపారు.
