డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : పాలకొండ రోడ్డులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన సినీ నటి రెజీనా కసాండ్రాతో కలిసి శ్రీకాకుళం పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో, నారీ శక్తి, శక్తి యాప్ పోస్టర్లను సినీ నటి రెజీనా కసాండ్రా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలో డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆపద సమయంలో శక్తి యాప్ ద్వారా పోలీసు వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మి, పోలీసు సిబ్బంది , యువత పాల్గొన్నారు.
