ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

పెద్దమందడి జామియా మసీదులో సర్పంచ్ గంగమ్మ ఇఫ్తార్ విందు ఏర్పాటు
ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం పెద్దలకు పండ్లు అందించిన ఎమ్మెల్యే

పెద్దమందడి, ఆంధ్రప్రభ : పెద్దమందడి మండల కేంద్రంలోని జామియా మసీదులో గ్రామ సర్పంచ్ గంగమ్మ రవి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం పెద్దలకు ఆయన పండ్లను అందించారు. వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి తమకు సహాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ఐ సత్య రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, వాకిటి నరేష్, ప్రవీణ్ రెడ్డి. టైలర్ రవి, కట్టెల పుల్లన్న, ఉప సర్పంచ్ ఉషన్న, వార్డు సభ్యులు రఫీ గట్టు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply