ప్రజల, బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

ప్రజల, బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
ఊట్కూర్ ఆంధ్రప్రభ : ప్రజలు బాటసారుల దహర్తి తీర్చేందుకు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చలివేంద్రం ఏర్పాటుచేసిందనిమొగ్దుంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్ధంపూర్ గ్రామ చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజల దహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఉపయుక్తంగా ఉంటుందనిఅన్నారు.
ప్రభుత్వం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేసిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడంతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. ప్రభుత్వం మండుటెండల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుమలేష్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ వార్డు సభ్యులు తదితరులుపాల్గొన్నారు.
