ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ…

ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ…

16సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో…
జగనన్న పాలన కోసం ప్రజలు ఎదురుచూపులు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో..
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి..

పాయకాపురం, ఆంధ్రప్రభ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సందర్భంగా స్థానిక 58వ డివిజన్ ప్రాంతంలో వైసీపీ శ్రేణులు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వీఎంసీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి పాల్గొని పార్టీ జెండా ఎగరవేసి,అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ మరణాంతరం ఆయన ఆశయాల కోసం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించి ప్రజల పక్షాన నిలబడి మద్దతు పొందిందని అన్నారు. వై.ఎస్.జగన్ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొన్నారని అన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా పాలనకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటాలు నిర్వహించిందని అన్నారు. వైసీపీ పార్టీ పోరాటాల ఫలితంగా వై.ఎస్ జగన్ 2019లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించి అనేక పథకాలు ఇంటి ముంగిటకు రేషన్, సచివాలయం, వాలేంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి ప్రజల మన్నలను పొందారని అన్నారు.

టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మరొకసారి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రాజారెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply