మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు

మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు
మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : మహిళలు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం 33వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు బసవేణి మన్నేమ్మ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్నపునేని నరేందర్ –మెహర్ వాణి దంపతులుహాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ మహిళా మణులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం నరేందర్ వాణి దంపతులు మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సాధికారత కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
