పట్టణ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

పట్టణ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

  • ప్రత్యేక బృందంతో 40 కుక్కల పట్టివేత

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కలను పట్టివేస్తున్నట్లు కమిషనర్ కాటం భాస్కర్ తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 29వ వార్డులో పిచ్చికుక్క స్వైర విహారం చేసి 16 మంది, రెండు గేదెలను కరిచి విషయం తెలిసిందే. పిచ్చి కుక్కల వల్ల భయభ్రాంతులకు గురైన పట్టణ ప్రజలు కమిషనర్ కుక్కలను పట్టివేయాలని వినతి పత్రాలు అందజే శారు. ఓకే వాడలోని 16 మంది వ్యక్తులను కుక్కలు కలవడంతో భయభ్రాంతు లైన ప్రజలు రాబీస్ వ్యాధి సోకకుండా నర్సంపేట జిల్లా ఆసుపత్రికి పరుగులు తీశారు.

యాంటీ రాబీస్ ఇంజక్షన్లు సరిపోవని వరంగల్ కు రిఫర్ చేయడంతో బంధువులు, రాజకీయ నాయకులకు డాక్టర్లతో వార్దివాదానికి దిగారు. దీంతో వైద్యులు ఇక్కడ ఆసుపత్రిలో వారికి చికిత్స చేస్తూ ర్యాబీస్ వ్యాధి రాకుండా ఇంజక్షన్లు వేశారు. కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆరోపణలు చేయడంతో నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ భాస్కర్ అంటేనే కుక్కలు పట్టే కోదాడ బృందాన్ని పిలిపించి గురువారం 8,9 వార్డులలో వీధి కుక్కలను పట్టించారు. వీధి కుక్కలను కోదాడకు చెందిన ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టుకొని ర్యాలీ ఆటోలో దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.

కుక్కలు పట్టుకోవడానికి కమిషనర్ భాస్కర్, వైస్ చైర్పర్సన్ గంధం నరేందర్ గుప్తా,వార్డు కౌన్సిలర్ దొంగల రజిత రవి, మున్సిపాలిటీ సిబ్బంది వీధులలో తిరుగుతూ కుక్కలను పట్టుకున్నారు. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సుమారు 40 కుక్కలను పట్టుకున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 వార్డులలో వందల సంఖ్యలో వీధికుక్కలు ఉన్నాయని, రాత్రిపూట ప్రధాన రహదారిపై కూడా వెళ్లాలంటే అనేక భయభ్రాంతులకు గురికావాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారి వెంబడి పరిగెత్తుతూ వారినీ కర వడానికి ప్రయత్నిస్తున్నా యని తెలిపారు. కుక్కలు వెంట పడడంతో కిందపడి తీవ్ర గాయాల పాలన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. వీధి కుక్కలను పట్టుకోడానికి స్పందించిన అధికారుల తీరుపై ప్రజలు చైర్పర్సన్, కమిషనర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకముందు కూడా వీధి కుక్కలు ఎక్కడున్నా వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.