Former Union Minister | ఆసుపత్రిలో చికిత్సపొందుతూ…

Former Union Minister | ఆసుపత్రిలో చికిత్సపొందుతూ…

Former Union Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి సాంబశివరావు ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్‌ సింగ్ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేశారు. సాంబశివరావు 1943లో ఏలూరులో జన్మించారు. వరంగల్‌ ఆర్‌ఈసీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నారు.

1984,1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో ఏలూరు లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళిశాఖ మంత్రిగా సేవలందించారు. మొత్తంగా 8,9,12,14,15 లోక్ సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2014 వరకూ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్న ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. కాగా.. కావూరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు.

Leave a Reply