బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!
నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందినట్లు దుగ్గొండి ఎస్ఐ రణధీర్ రెడ్డి తెలిపారు. మండలంలోని తొగర్రాయి గ్రామ శివారు మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరవేణి మనోహర్ (26) గిర్నిబావి వైపు నుంచి దుగ్గొండికి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదం ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లుఎస్సై తెలిపారు.
