WAR EFFECT | భారీగా పెరిగిన పెట్రోల్ ధర..
WAR EFFECT | భారీగా పెరిగిన పెట్రోల్ ధర..
WAR EFFECT | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకలో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ పెరుగుదల సామాన్య ప్రజల రోజువారీ జీవనాన్ని మరింత కష్టతరం చేస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, వస్తువుల ధరలు పెరిగిపోవడం, ఆహార ధరలు భారీగా పెరగడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ఆందోళనలను రేపుతున్నాయి. శ్రీలంక ప్రభుత్వం ఇంధన ధరల పెంపును అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి కారణంగా అనివార్యమని వాదిస్తున్నప్పటికీ, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పెరిగిన ధరల వివరాలు (లీటరుకు): ఇలా ఉన్నాయి…
ఆక్టేన్ 92 పెట్రోల్: రూ. 317 (రూ. 24 పెరుగుదల)
ఆక్టేన్ 95 పెట్రోల్: రూ. 365 (రూ. 25 పెరుగుదల)
ఆటో డీజిల్: రూ. 303 (రూ. 22 పెరుగుదల)
సూపర్ డీజిల్: రూ. 353 (రూ. 24 పెరుగుదల)
కిరోసిన్: రూ. 195 (రూ. 13 పెరుగుదల)
