Dispute | ఎన్‌సీఈఆర్‌టీ బహిరంగ క్షమాపణలు..

Dispute | ఎన్‌సీఈఆర్‌టీ బహిరంగ క్షమాపణలు..

Dispute | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి సాంఘీక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠ్యాంశంగా చేర్చటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ పుస్తకంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బ్లాంకెట్ బ్యాన్ విధించిన రెండు వారాల తర్వాత ఈ వివాదంపై ఎన్‌సీఈఆర్‌టీ స్పందించింది. బహిరంగ క్షమాపణలు చెప్పింది. పుస్తకం మొత్తాన్ని ఉపసంహరించుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.అధికారిక పత్రికా ప్రకటన ద్వారా ఎటువంటి షరతులు లేని పూర్తి క్షమాపణలు తెలిపిన సంస్థ, వివాదాస్పద అధ్యాయం ఉన్న పూర్తి పుస్తకాన్ని మార్కెట్, విద్యాసంస్థల నుంచి తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.