ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

వైరా శాసన సభ్యులు మలోత్ రాందాస్ నాయక్

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల చేత కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. సోమవారం 99 రోజుల కార్యాచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఎమ్మెల్యే సందర్శించారు. పిహెచ్సి లో చికిత్స పొందుతున్న రోగులను కలసి అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం పేదల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లోని ప్రజలకు నిపుణులైన డాక్టర్లతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బులు క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులను గుర్తించి కార్పొరేట్ స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తామని ఎమ్మెల్యే రోగులకు భరోసానిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పై నమ్మకంతో రాష్ట్రంలో ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారన్నారు.

వైద్యుల, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని, విధినిర్వహణలో సమయపాలన పాటించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పిహెచ్సి సందర్శనకు విచ్చేసిన ఎమ్మెల్యేకు డాక్టర్ వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, ఆ పార్టీ మండల అధ్యక్షులు మలోత్ మంగీలాల్ నాయక్, మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, హెల్త్ సూపర్వైజర్ రాధిక, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.