Retardation | 30 ఏళ్ళ క్రితం స్పెషల్ ఎడ్యుకేషనల్ కోర్సు పూర్తి చేసిన తల్లి

Retardation | 30 ఏళ్ళ క్రితం స్పెషల్ ఎడ్యుకేషనల్ కోర్సు పూర్తి చేసిన తల్లి
మున్సిపల్ కార్పొరేషన్ టీచర్ ముదిలి శ్రీదేవి
Retardation | చిట్టినగర్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కొందరి మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉన్న మహిళ మున్సిపల్ కార్పొరేషన్ టీచర్ ముదిలి శ్రీదేవి. తమ పిల్లలే తమ లోకం అనుకోనే సమయంలో తమ చిన్నారికి బుద్ధి మాంద్యం ఏర్పడి వారి భవిష్యత్తు అంధకారం కాబోతుంది అని తెలిసినప్పుడు ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు. మిన్ను విరిగి మీద పడినంత ఆవేదన ఉంటుంది.
తన బిడ్డ ప్రత్యేక అవసరం గల పిల్లవాడు అని పుట్టిన సంవత్సరానికి వైద్యులు తెలిపినప్పడు ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా, దానికి ఏ మందు పనిచేయదని కేవలం వారికి స్వాంతన కలిగించేలా చేయడమే మార్గమని భావించిన స్పెషల్ ఎడ్యుకేషనల్ కోర్సు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమె కుడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూర్చుంటే ఆమె కు ఇతరులకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. తన ఆవేదననే అవకాశంగా మలుచుకొని తన లాంటి తల్లులకు ఆదర్శంగా నిలిచిన ఒక మాతృమూర్తి ఎం. శ్రీదేవి.

ముప్పై ఏళ్ల క్రితం కేవలం హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రి వంటి 3 ప్రాంతాల్లో మాత్రమే కోర్సు లభ్యమయ్యేది. రాజమండ్రిలో ఉన్న ఠాగూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ రిటార్డేషన్ లో ఎంట్రన్స్ టెస్ట్ వ్రాసి టాపరు గా నిలిచి అడ్మిషన్ తీసుకొని అక్కడే సంవత్సరం పాటు కోర్సును పూర్తి చేశారు. తను సొంతగా తన కుమారుడికి శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. 2000 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు సర్వ శిక్ష అభియాన్ ద్వారా కాంట్రాక్టు బేసేస్ మీద ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులో సెలెక్ట్ అయ్యారు.
మొదటగా పామర్రు మండలంలో నాలుగు సంవత్సరాలు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించి వారికి శిక్షణ ఇవ్వడం చేశారు. ఉదయం నాలుగు గంటలకు తయారై తన బిడ్డతో పాటుగా నాలుగు సంవత్సరాలు బస్సు ప్రయాణం చేసి విజయవాడ నుంచి పామర్రు చేరుకొని మిగతా పిల్లలతో పాటుగా తన బిడ్డకు కూడా శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే శిక్షణా పరికరాలు ట్రై సైకిల్స్ ఆ పిల్లలకు సంబంధించిన పెన్షన్ వగైరాలు అందజేశారు.
Retardation | 2008లో
ఇలా అందరికీ సేవ చేయటం జరిగింది. పామర్రు నుంచి విజయవాడ అర్బన్ కు ట్రాన్స్ఫర్ అయి నాలుగు సంవత్సరాలు ఇక్కడ పిల్లలకు తన సేవలను అందించారు. తల్లిదండ్రులకు ఆ పిల్లలను ఏ విధంగా చూసుకోవాలో వారితో ఎలా మెలగాలో శిక్షణ ద్వారా తెలియజేశారు. తన బిడ్డకు నడకరాదని వైద్యులు చెప్పినప్పుడు వెనకడుగు వేయకుండా తను నేర్చుకున్న ఫిజియోథెరపీ ద్వారా తన బిడ్డ నడిచేటట్లు చేసుకున్నారు.

ఇదే సేవా దృక్పథంతో మిగతా తల్లిదండ్రులకు అందించారు. 2008లో ప్రభుత్వం వారు ప్రకటించిన జనరల్ డిఎస్సీ లో తాను చదివిన స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తో ఉత్తీర్ణత సాధించి కార్పోరేషన్ పాఠశాలలో ప్రాథమిక టీచరుగా నియమితులైనారు. మొట్టమొదటి సారిగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గా డీఎస్సీ లో అర్హత సాధించారు . ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కౌన్సిలింగ్ తో పాటు తాను చేసిన సేవను అప్పటి కార్పొరేషన్ కమిషనర్ గుర్తించి రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ ఉద్యోగినిగా ప్రసంశాపత్రం అందజేశారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క ఇష్టాన్ని ఓపికగా సహనంతో గమనించి వారి ఇష్టపూర్వకంగా వారు కోరుకున్నది ఇస్తూనే పిల్లల మానసిక వికాసాన్ని అభివృద్ధి చేయాలని చాలామంది తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇప్పుడంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వమే మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మానసిక వైకల్యం కలిగి ఉంటారు. ఇతర పిల్లల కంటే నెమ్మదిగా ఎదుగుదల ఉంటుంది.
కొందరిలో సరిగ్గా మాటలాడలేకపోవడం, మరికొందరులో వినికిడి లోపం, అంధత్వం లాంటి శారీరక వైకల్యాలు ఉంటాయి. అలాంటి పిల్లలు చెప్పేది ఓపికగా వినడం, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, వారికి అర్థం అయ్యేలా చెప్పడం చేయాలి. వారిని ఇతరులతో సమానంగా అభివృద్ధి వైపు అడుగులు వేయించడమే నిజమైన సేవ అవుతుంది.
CLICK HERE TO READ MORE : study | చదువు ద్వారానే సమాజంలో ఉజ్వల స్థానం..
