Fire | కేపీహెచ్‌బీ ఫేజ్‌-6లో అగ్నిప్రమాదం

ఖాళీ స్థలంలో చెత్తను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం, టీ దుకాణానికి అంటుకున్న మంటలు
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : న‌గ‌రంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీ ప్లాట్లలో పేరుకుపోయిన చెత్తలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, అవి పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం, టీ షాపుకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆ రెండు దుకాణాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. అక్క‌డ ఎలాంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు.

Leave a Reply