అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు..
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం తెలుగురావుపాలెం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులను ఘనముగా సన్మానించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథి వచ్చిన గుత్తికొండ చారిటబుల్ అధినేత శ్రీ గుత్తికొండ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మీరందరూ వివిధ హోదాలో ప్రభుత్వ ఉద్యోగులని మీకు ఇచ్చిన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి గ్రామస్తులతో అభినవ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
తర్వాత గ్రామ సర్పంచ్ బాబు మాట్లాడుతూ మహిళలు ఆ రోజుల్లో బయటకు రావడానికి భయపడే వాళ్ళని ఈ రోజుల్లో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో సమానంగా ఉంటున్నారు అన్నారు. ఎక్కువగా యువత సోషల్ మీడియాను అనుకరించి చెడు మార్గాల్లో వెళుతున్నారని అలా కాకుండా సోషల్ మీడియాను కెరియర్ పై దృష్టి పెట్టా అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులను, సచివాలయ మహిళా సిబ్బందిని, మెడికల్ సిబ్బందిని, అంగన్వాడి వర్కర్లను, ఆశ వర్కర్లను ప్రోటీన్ మొక్కలతో శాలువాతో ఘనముగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరుంబాక రవి, పంచాయతీ కార్యదర్శి జి.సుధాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
