ఏసీపీ అధికారుల మెరుపు దాడి..

ఏసీపీ అధికారుల మెరుపు దాడి..

  • గజ్వేల్ తహసిల్దార్.. కరీంనగర్ లోని ఇంట్లో సోదాలు..
  • భారీగా నగదు.. కీలక పత్రాలు స్వాధీనం

కరీంనగర్ క్రైమ్, ఆంధ్ర‌ప్ర‌భ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసిల్దార్ శ్రావణ్ కుమార్ ఇంట్లో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు శ్రావణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద, లక్ష్మీనగర్లోని సోదరి ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply