మహిళా దినోత్సవం సందర్భంగా..

కరిమాబాద్, ఆంధ్రప్రభ ; లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం.. అనే సూక్తిని నిజం చేస్తూ 34 డివిజన్ శివనగర్ కి చెందిన నలుగురు మహిళలు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నారు ముగ్గురు ఉపాధ్యాయులు కాగా ఒకరు కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. కౌటం వెంకట్రాంనరసయ్య ..విజయక్ష్మి దంపతులకు 4 గురు కూతుర్లు ఒక కుమారుడు కౌటం వెంకట్రాం నరసయ్య ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించి తన సంతానాన్ని ఐదుగురిని ఉన్నత చదువులు చదివించాడు.
మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న కూతురు ఉపాధ్యాయురాలు తాటిపాముల ధనలక్ష్మి మాట్లాడుతూ నాన్న ఎంతో కష్టపడి నలుగురు ఆడపిల్లలను ఒక అన్నయ్యను చదివించాడని తండ్రివెంకట్రాం నరసయ్య స్మృతులను నెమరు వేసుకునీ సంస్మరించుకున్నారు.ఆ కుటుంబం శివనగర్ ప్రాంతానికి ఆదర్శంగా నిలిచారు.
ఆయనకు సరస్వతి ,భవాని ,నీరజ, ధనలక్ష్మి నలుగురు ఆడపిల్లల సంతానం కౌటం శ్రీనివాస్ ఒకే కుమారుడు. విద్యాశాఖలు విధులు నిర్వహిస్తున్నాడు. చదువు , విద్యయొక్క విలువ తెలిసిన కీర్తిశేషులు వెంకట్రాం నరసయ్య నలుగురు కూతుర్లు భారంగా భావించకుండా ఉన్నత చదువులు చదివించడంతో నలుగురు కూతుర్లు కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడ్డారు.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని డివిజన్ ప్రజలు వారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూతుర్లు కుమారుడు వసుదైక కుటుంబం లాగా కలిసి మెలిసి ఉండేటివారు. ఆ కూతుర్లు వారి వారి మెట్టినిల్లు లో ఇంట్లో స్థిరపడ్డారు. ఉద్యోగ నృత్య వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు.గత 20 సంవత్సరాల క్రితమే వెంకట్రామ్ నరసయ్య దూర దృష్టితో విద్య గురించి ఆలోచించి తన పిల్లలకు విద్యను అందించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
