World War 3 Fear : ప్రపంచం ఉక్కిరి బిక్కిరి Andhta Prabha Detail Report

World War 3 Fear : ప్రపంచం ఉక్కిరి బిక్కిరి Andhta Prabha Detail Report

  • టెహ్రాన్‌లో పేలుళ్లు
  • “బేషరతుగా లొంగిపోండి”..
  • అమెరికా అల్టిమేటం..
  • మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం
  • టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం..
  • అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు
  • యుద్ధంలో గ‌ల్ఫ్ దేశాలూ సిద్ధం
  • హార్ముజ్ జలసంధి మూసివేత
  • ప్రపంచం ఆందోళన
  • పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ
  • భారతీయులకు కేంద్రం అత్యవసర సూచనలు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్)

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు తీవ్రరూపం దాల్చాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నేపథ్యంలో టెహ్రాన్ సహా కీలక అణు స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించడంతో ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ భయం పెరుగుతోంది. ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ చెల‌గాటం తారా స్థాయికి చేరుతోంది. భేష‌ర‌తుగా లొంగిపోవాల‌ని ఇరాన్ కు అమెరికా ఆల్టిమేటం జారీ చేయ‌గా.. ప్ర‌తీకార దాడుల‌తో ఇజ్రాయెల్‌, అమెరికా స్థావ‌రాపై ఇరాన్ చెల‌రేగిపోతోంది.

World War 3 Fear

ఫ‌లితంగా ప‌శ్చిమ ఆసియాలో జ‌రుగుతున్న యుద్ధంతో .. స‌భ్య ప్ర‌పంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ ప‌రిస్థితిపై ఐక్య‌రాజ్య స‌మితి కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య జ‌గ‌డానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని భార‌త్ స‌హా అనేక ప్ర‌పంచ దేశాలు కోరుతున్న త‌రుణంలో.. ఈ రోజు శ‌నివారం ఐక్య‌రాజ్య స‌మితి అత్య‌వ‌స‌ర స‌మావేశం కానుంది. ఇక ఫిబ్రవరి 28, 2026న ఇరాన్ సై ఇజ్రాయెల్‌, అమెరికా జాయింట్ “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” (Operation Epic Fury) నేపథ్యంలో ఈ రెండు దేశాలు ఇరాన్‌పై మూకుమ్మ‌డి దాడి చేస్తున్నాయి. మార్చి 7, 2026 నాటికి ఈ యుద్ధం పశ్చిమ ఆసియా అంతటా విస్తరించింది.

World War 3 Fear : ఇరాన్ పై భీక‌ర దాడులు

World War 3 Fear

ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థ , నాయకత్వ శ్రేణి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు , డ్రోన్ తయారీ కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు 300కు పైగా ఇరాన్ క్షిపణి లాంచర్లను నిర్వీర్యం చేసినట్లు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఇరాన్ లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది . ఇరాన్ రెడ్ క్రెసెంట్ , ఇతర వనరుల ప్రకారం, ఇప్పటి వరకు ఇరాన్‌లో 1,332 మందికి పైగా మరణించారు. ఇందులో సుమారు 1,100 మందికి పౌరులు ఉన్నట్లు అంచనా. లెబనాన్‌లో సుమారు 200 మంది, ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు మృతి చెందారు. గల్ఫ్ దేశాలలో కూడా సుమారు 9 మంది మరణించినట్లు సమాచారం.

World War 3 Fear : అణుస్థావరాలే ల‌క్ష్యం

World War 3 Fear

ఇజ్రాయెల్ , అమెరికా జాయింటుగా చేపట్టిన “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” (Operation Epic Fury) రెండవ వారానికి చేరింది. శనివారం (మార్చి 7) తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భారీగా దాడులు చేశాయి. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం , గతంలో సుప్రీం లీడర్ ఖమేనీ నివసించిన ప్రాంతంలోని భూగర్భ బంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ “బేషరతుగా లొంగిపోయే” (Unconditional Surrender) వరకు యుద్ధం ఆగదని, మరింత తీవ్రమైన దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తన క్షిపణులతో టెల్ అవీవ్ , జెరూసలేం వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి.

World War 3 Fear

ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ సమీపంలోని కొన్ని అణు పరిశోధనా కేంద్రాలు నటాంజ్ (Natanz) అణు ఇంధన కర్మాగారం ప్రవేశ ద్వారాలు ఇజ్రాయెల్ దాడిలో దెబ్బతిన్నాయ‌ని ఇజ్రాయెల్ చెబుతోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) మార్చి 2-3 తేదీల్లో స్పందిస్తూ.. ప్రధాన అణు వ్యవస్థలకు , రియాక్టర్లకు ఎటువంటి నష్టం జరగలేదని, రేడియోధార్మిక ముప్పు లేదని స్పష్టం చేసింది. ఇరాన్ దాడులకు ధీటుగా సమాధానం ఇస్తూ, ఇజ్రాయెల్ వాయుసేన ఇరాన్ లోని ఇస్ఫాహాన్ (Isfahan) మరియు నటాన్జ్ (Natanz) సమీపంలోని కీలక అణు పరిశోధనా కేంద్రాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ గగనతలంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి.

World War 3 Fear : ఇరాన్ దెబ్బ‌కు దెబ్బ‌

World War 3 Fear

తన క్షిపణులు. డ్రోన్లతో ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎదురుదాడి చేస్తోంది. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, హైఫా , బెన్ గురియన్ విమానాశ్రయం వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వందలాది క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ తన మిత్రదేశాలు హెజ్బోల్లా, హౌతీ రెబల్స్‌తో కలిసి ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో దాడులు ప్రారంభించింది. సుమారు 200 కంటే ఎక్కువ డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ దిశగా ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఇప్పటి వరకు తొమ్మిది దేశాలపై దాడులు చేసింది. ఇందులో బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.

World War 3 Fear : రంగంలోకి .. గల్ఫ్

World War 3 Fear

ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలు అనివార్యంగా భాగస్వామ్యం కావాల్సి వస్తోంది:
ఇరాన్ తన పొరుగున అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. దుబాయ్, అబుదాబి, దోహా వంటి నగరాల్లో క్షిపణి శకలాలు పడటం వల్ల పౌర విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలు ప్రభావితమయ్యాయి. కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మూసివేశారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులు నిలిచిపోయాయి.

World War 3 Fear : ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ

World War 3 Fear

పరిస్థితి చేయిదాటి పోకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఈరోజు మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ కానుంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని భారత్ సహా పలు దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నేరుగా క్షిపణి యుద్ధం (Direct War) ప్రారంభమవ్వడం ప్రపంచవ్యాప్తంగా మూడవ ప్రపంచ యుద్ధ భయాలను కలిగిస్తోంది.

World War 3 Fear : అమెరికా జోక్యం

అమెరికా తన యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రంలో మోహరించింది. ఇజ్రాయెల్‌కు రక్షణగా అమెరికా వైమానిక దళం రంగంలోకి దిగి, ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో సగానికి పైగా గాలిలోనే కూల్చివేసినట్లు పెంటాగన్ ప్రకటించింది.

World War 3 Fear : భార‌త్ అప్ర‌మ‌త్తం

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తన పౌరుల రక్షణ కోసం కీలక సూచనలు చేసింది: ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం మార్చి 3న “అత్యంత జాగ్రత్త” (Utmost Caution) వహించాలని అడ్వైజరీ జారీ చేసింది. పౌరులు అనవసరంగా బయట తిరగవద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచించింది. టెహ్రాన్‌లోని మెజారిటీ భారతీయ విద్యార్థులను రాయబార కార్యాలయం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

World War 3 Fear


ఇజ్రాయెల్‌లో స్థానిక ప్రభుత్వం , ‘హోమ్ ఫ్రంట్ కమాండ్’ ఇచ్చే భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని Tel Aviv రాయబార కార్యాలయం కోరింది. ఎల్లప్పుడూ బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది. ఖతార్ (దోహా) వంటి దేశాల్లోని భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని తాజా అడ్వైజరీ పేర్కొంది. ఆయా దేశాల్లోని భారతీయులు వెంటనే భారత రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లలో లేదా MADAD పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

  • హెల్ప్‌లైన్ నంబర్లు:
  • టెహ్రాన్ (ఇరాన్): +989128109115, +989128109109
  • టెల్ అవీవ్ (ఇజ్రాయెల్): +972-54-7520711
  • దోహా (ఖతార్): +974-55647502

ALSO READ : gulf heart attack : గ‌ల్ఫ్ గుండెకు షాక్ Andhra Prabha News Analysis

Leave a Reply