మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు
కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మహిళల సంక్షేమమే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు అన్నారు. శనివారం కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో నూతన ఐకెపి విఓ భవనం నిర్మాణం పనులకు పాత కొండుకూర్ గ్రామంలో నూతన అంగన్వాడి భవనం నిర్మాణం పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేడమా బొజ్జు మాట్లాడుతూ .. ప్రభుత్వం మహిళ గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రూ. 500లకే గ్యాస్ సిలిండర్లు మహిళల పేరిట ఇందిరమ్మ పథకం ఇల్లు మంజూరు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళలకు కోటీశ్వరులు చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి సతీష్ రెడ్డి, పి శాంతన్ రెడ్డి, కొండుకూరు గ్రామ సర్పంచ్ మామిడిపెళ్లి భీమేష్, ఉపసర్పంచ్ పి సంపత్ రెడ్డి, కడం ఎంపీడీవో సునీత, ఈజీఎస్ ఏపిఓ జయదేవ్, ఐకెపి ఎపిఎం గంగాధర్, ఐకెపిసిసి విష్ణువర్ధన్, అంబారీపేట గ్రామ సర్పంచ్ టి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు టి మల్లేష్ యాదవ్, కే సత్యం చారి ముక్కెర, శ్రీనివాస్ టి సంజీవ్ పటేల్, కడెం మాజీ వైస్ ఎంపీపీలు పి సంతోష్ రెడ్డి, కట్ట శ్యాంసుందర్, స్థానిక పంచాయతీ కార్యదర్శి అరుణ, పాత కొండుకూర్ ఎంపీపీ ఎస్ పాఠశాల టీచర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
