Social media | నిషేధం

Social media | నిషేధం

Social media | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) పిల్లల భవిష్యత్తును రక్షించేందుకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించింది (Social media ban). మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న మానసిక ఒత్తిడి, ఆందోళన, దృష్టి లోపం, నిద్ర లేమి, అసాంఘీక ప్రవర్తన వంటి ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయానికి ముఖ్య కారణమని సీఎం సిద్దరామయ్య (CM Siddaramaiah) స్పష్టం చేశారు.

ఈరోజు కర్ణాటక బడ్జెట్ (Karnataka Budget) ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేసిన ఆయన, ఇది పిల్లల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తును కాపాడే బాధ్యతాయుతమైన నిర్ణయమని వివరించారు. ఈ చర్యతో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నియంత్రణలు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.

Leave a Reply