Lebanon | 16 గ్రామాల ఖాళీకి ఆదేశాలు

Lebanon | 16 గ్రామాల ఖాళీకి ఆదేశాలు
Lebanon | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ఇప్పుడు పూర్తి స్థాయి రణరంగంగా మారిపోయింది. ఇరాన్ మద్దతుదారు హిజ్‌బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తుండగా… ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) లెబనాన్‌పై దాడులను అత్యంత తీవ్రతరం చేశాయి. లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్‌బుల్లా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భారీ సైనిక దాడులు చేస్తోంది. భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనిక దళాలు లెబనాన్‌లో మోహరించాయి. ఈ దాడుల్లో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా ఇజ్రాయెల్ సైన్యం 16 గ్రామాలను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్-అమెరికా (America) సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమార్చబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్, హిజ్‌బుల్లా, ఇతర మద్దతుదారు గ్రూపులు ప్రతీకార దాడులకు దిగగా… ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను అత్యంత ఆందోళనతో పర్యవేక్షిస్తున్నాయి. ప్రాంతీయ యుద్ధం పూర్తిస్థాయికి చేరే ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది.
