ఘనంగా ఉద్యమి సభ్యత్వ నమోదు..

ఘనంగా ఉద్యమి సభ్యత్వ నమోదు..

పవన్ కళ్యాణ్ ఆశయాలకు ప్రజల మద్దతు

బాపట్ల రూరల్ , ఆంధ్రప్రభ : మండలంలోని జిల్లెల్లమూడి గ్రామంలో మంగళవారం నాడు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న నిబద్ధతకు ఆకర్షితులై గ్రామస్తులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఉద్యమి సభ్యత్వాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శివన్నారాయణ మాట్లాడుతూ.. జనసేనాని అడుగుజాడల్లో నడిచే ప్రతి ఒక్కరూ సమాజ మార్పులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ పార్టీ అధ్యక్షులు వేల్పురి నాగరాజు, పి ఏ సి యస్ జమ్ములపాలెం త్రీ మాన్ కమిటీ మెంబర్ నంగనం సుబ్బరాజు, చుండి నవీన్ శర్మ, వేల్పురి శ్రీను, కగ్గ నాగరాజు, బాపట్ల పోలేరమ్మ తల్లి దేవస్థాన ముఖ్య కార్యదర్శి రాగం శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు జిడుగు రాజేష్, సిగిరి శెట్టి సంజయ్ నాయుడు, సాదక్ (క్రియాశీలక వాలంటీర్లు), జనసేన నాయకులు, జనసైనికులు, స్థానిక గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply