పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ సిద్ధం.. ఎంపీలకు సీఎం దిశానిర్దేశం

అమరావతి, ఆంధ్రప్రభ: ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సమర్థవంతంగా ప్రస్తావించేలా ఎంపీలకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారంతో అమలు చేయాల్సిన ప్రాజెక్టులు తదితర అంశాలపై సమన్వయంతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రాధాన్య అంశాలు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది.