కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

బీబీనగర్, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలు మరో ఇంటిని చిదిమేశాయి. మండలంలోని గొల్లగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేకల మహేష్ యాదవ్ భార్య ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. దంపతుల మధ్య గత ఆరు నెలలుగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి అమ్మగారింటికి వెళ్లి ఉంటోంది. సోమవారం కుటుంబ సభ్యులు ఆమెను భర్త ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు.
అయితే.. అదే రోజు రాత్రి ఐశ్వర్య తీవ్ర మనస్తాపంతో తన ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి హతమార్చి, అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply