సుజాత విద్యానికేతన్లో.. హోలీ వేడుకలు..

సుజాత విద్యానికేతన్లో.. హోలీ వేడుకలు..
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : సప్తవర్ణాల శోభితమైన వసంతోత్సవ హోలీ సంబరాలను కాలుష్యహితంగా నిర్వహించుకోవాలని సుజాత విద్యా నికేతన్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఆకు తోట శాంతారామ్ కర్ణ సూచించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని సుజాత విద్యా నికేతన్ లో పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో కాలుష్య రహిత హోలీ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ మాట్లాడుతూ.. ఆనందోత్సాహాలతో జరుపుకునే కనుల విందైన పండుగ హోలీ వయసుతో నిమిత్తం లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ కేరింతలతో, ఆనందాలతో ఉత్సాహంగా వేడుకలో పాల్గొంటామని అన్నారు. అయితే.. సంబరాల్లో అత్యంత విషపూరితమైన రసాయనాలతో కూడిన రంగులు వాడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నామని వాపోయారు. రసాయనాలతో కూడిన రంగులు పులుముకోవడం వలన అలర్జీ లాంటి చర్మవ్యాది, ఆస్తమాతో పాటు కంటిచూపు కోల్పోవడం వెంట్రుకల రంగు మారిపోవడం వంటివి జరుగుతాయని తెలిపారు. కనుక సహజంగా లభించే పసుపు, కుంకుమ, బుక్క గులాలు, చెట్ల పూలతో తయారు చేసిన రంగులను వాడాలని, వీటి ద్వారా ఎటువంటి హాని లేకపోగా శరీరానికి మరింత కాంతి సౌందర్యాన్ని తెస్తాయని పేర్కొన్నారు.
విద్యార్థినీ, విద్యార్థులందరూ ఈ హోలీ పండుగను విషపూరితం చేయకుండా కాలుష్య రహిత హోలీని నిర్వహించుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని రంగు రంగుల పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు జూపాక నాగరాజు ఏ వెంకట్, ఈ ప్రవీణ్, వెంకటేశ్వర్లు, వై అరుణ, జి సంధ్య, సిహెచ్ సంధ్య, సిహెచ్ సుచిత్ర, ఎల్ సరిత, పి మౌనిక, జి దేవిక, సబిహ బేగం, ప్రవళిక, దేవిక, భవాని, సుధారాణి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
