వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
జన్నారం,ఆంధ్రప్రభ : వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి. సుష్మారావు అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వన్యప్రాణుల మనుగడపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు.
అడవుల్లో చాలా రకాల జీవజాతులు నివసిస్తున్నాయన్నారు సుష్మారావు . జీవ వైవిధ్యంతో మానవ మనుగడ అడవులతో ముడిపడి ఉందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం దుంపల తిరుపతి,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు నహీదాఫర్వీన్,శంకర్, ఉపాధ్యాయులు తుంగూరి గోపాల్ చంద్రిక, రాజేందర్, రామారావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
