TG | ఉపాధి చట్టాన్ని కొనసాగించాలి..

TG | ఉపాధి చట్టాన్ని కొనసాగించాలి..
కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి రవి కుమార్, సీ ఐ టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ల డిమాండ్.
TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ డిమాండ్ చేశారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూ, ఏఐకేఎస్ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో కార్మిక ప్రజా రైతు ఉద్యోగ నిరుద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేసి మత ఉన్మాదుల రంగు పుల్మడం గర్హనీయమన్నారు.
సమావేశంలో వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శనిగారపు అశోక్, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు కోరేంగ మాలశ్రీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క, సీఐటీయూ బెల్లంపల్లి మండల సెక్రెటరీ చల్లూరి దేవదాస్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుమ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోమాస అశోక్, పీఎన్ఎం జిల్లా అధ్యక్షుడు పాగిడి కిషన్ పాల్గొన్నారు.
