దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి…

దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలి…

నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్
ఉభయ నాగేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

కోడూరు – ఆంధ్రప్రభ : దేవస్థానం అభివృద్ధికి ధర్మకర్తలు కృషి చేయాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ కోరారు. ఆదివారం సాయంత్రం కోడూరు మండలం పిట్టల్లంకలోని ఉభయ నాగేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

నూతన ధర్మకర్తల మండలి చైర్మనుగా బండే కొండలరావు, సభ్యులుగా చింతా వరలక్ష్మి, చింతా వెంకటేశ్వరమ్మ, బావిశెట్టి శివ నాగమల్లేశ్వరరావు, కొప్పుల నరసింహారావు, తెనాలి లక్ష్మి రత్నకుమారి, అట్లూరి తులసికృష్ణ, సన్నిధిరాజు స్వర్ణ కుమారిలతో దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్ కే.శ్రీనివాసరావు, ఈఓ సీహెచ్ సుధాకరరావు ప్రమాణ స్వీకారం చేయించగా, ముఖ్య అతిధి వెంకట్రామ్ వారిని ఘనంగా సత్కరించారు. నీటి సంఘం ఉపాధ్యక్షులు గాదె భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సభలో సర్పంచ్ కనగాల వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ మర్రె గంగయ్య, మాజీ సర్పంచ్ బడే నాగరాజు, బడే వెంకట్రావు, విశ్వనాధపల్లి దేవస్థానం డైరెక్టర్ తోట సోమశేఖర్, నాయకులు కంచర్లపల్లి వెంకటరమణ, బండే సీతారామయ్య, పూతబోయిన సీతా రత్న సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply