ఇంటికి చేరిన మల్లోజుల

ఇంటికి చేరిన మల్లోజుల

  • 45 ఏళ్ల తర్వాత పెద్దపల్లికి
  • కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపులు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ ; 45 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల కోటేశ్వరరావు సొంత ఊరు సొంత గూటికి చేరుకున్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి మల్లోజుల భార్య తార తో కలిసి వచ్చారు. సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

1980లో సొంత ఊరిని కుటుంబ సభ్యులను విడిచి ఉద్యమ బాట ఎంచుకుని మల్లోజుల వేణుగోపాలరావు అడవి బాట పట్టాడు. ఉద్యమ ప్రస్థానంలో అంచలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయి వరకు ఎదిగారు. ఇటీవల మల్లుజుల లొంగిపోయిన సంగతి విధితమే. సుదీర్ఘ విరామం అనంతరం మల్లుజుల స్వగ్రామానికి రావడం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది.

Leave a Reply