రాష్ట్ర ప్రభుత్వ పథకాలే.. కాంగ్రెస్ గెలుపుకు శ్రీరామరక్ష

రాష్ట్ర ప్రభుత్వ పథకాలే.. కాంగ్రెస్ గెలుపుకు శ్రీరామరక్ష

చేవెళ్ల, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి శ్రీరామరక్షగా దోహదపడతాయని చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి దేవర సమతా వెంకటరెడ్డి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలోని15, 16, 17 వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ గుర్తు చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మహిళలకు ఉచిత బస్,200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ రూ.2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు తదితర జనరంజక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. చేవెళ్ల శాసన సభ్యులు కాల యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.