విద్యార్థులే ఉపాధ్యాయులైనవేళ…

విద్యార్థులే ఉపాధ్యాయులైనవేళ…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు వివిధ వేషాధారణలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. స్వయం పరిపాలన దినోత్సవం పురస్కరించుకుని మండల విద్యాశాఖ అధికారిని మాధవి, ఉప సర్పంచ్ రమేష్, పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ కృష్ణవేణి పాఠశాలను సందర్శించి బోధన తీరు పరిశీలించి విద్యార్థులను అభినందించారు.
కలెక్టర్, గా కృష్ణ శ్రీ, ఎంఈఓ గా భువన శ్రీ, హెచ్ఎం గా అవినాష్ తోపాటు పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. అనంతరం చక్కగా పాఠాలు బోధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానంచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తిప్పన్న, ఉపాధ్యాయ బృందం బనేస్ అరుణ నరసింహ వార్డు సభ్యులు కొక్కు మల్లేష్ కొక్కురూపలక్ష్మణ్, సామాజిక కార్యకర్త నారాయణ తదితరులు పాల్గొన్నారు.
