ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శ్రీహరి
వచ్చే డిసెంబర్ వరకు పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి
మక్తల్,ఆంధ్రప్రభః మక్తల్ పట్టణంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఇవాళ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఈ సందర్భంగా అధికారులకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. దాదాపుగా చివరి దశకు చేరుకున్న పనులను మరింత వేగం పెంచి త్వరగా పనులను పూర్తి చేయాలని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి సూచించారు.
పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం లక్షంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే పనుల్లో మరింత వేగం పెంచాలని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్షమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, జి. లక్ష్మారెడ్డి, బి. గణేష్ కుమార్ ,గోవర్ధన్, యగ్నేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
