Astrologer | హోలీ పండుగ తేదీలపై స్పష్టత

Astrologer | హోలీ పండుగ తేదీలపై స్పష్టత

అర్చకులు కాటేపల్లి శ్రీనివాస శర్మ

Astrologer | అచ్చంపేట, ఆంధ్రప్రభ : హోలీ పండుగ నిర్వహణ తేదీలపై ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిష్యుల సమావేశం జరిగినట్లు అచ్చంపేట పట్టణ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రధాన అర్చకులు కాటేపల్లి శ్రీనివాస్ శర్మ శనివారం ఒక ప్రకటనలు తెలిపారు. ఈ సమావేశంలో చంద్రమానం ప్రకారం పండుగ తేదీలపై చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు..

చంద్రగ్రహణం కారణంగా ఏర్పడిన సందిగ్ధతను తొలగిస్తూ, జ్యోతిష్య పండితుల సూచనల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, మార్చి 2వ తేదీ (సోమవారం) రాత్రి కామదహనం, మార్చి 4వ తేదీ (బుధవారం) హోలీ పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఉన్నందున ఆ రోజు హోలీ పండుగ జరపరాదని వారు స్పష్టం చేశారు.

ప్రజలు ఈ నిర్ణయాన్ని గౌరవించి సంప్రదాయబద్ధంగా పండుగ నిర్వహించాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని హిందూ బంధువులు ఈ నిర్ణయాన్ని పాటించాలని, గందరగోళానికి గురికాకుండా నిర్ణీత తేదీల్లోనే హోలీ పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply