విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి..

దమ్మపేట, ఆంధ్రప్రభ : విద్యార్థులు సైన్స్ రంగంలో రాణించి శాస్త్ర వేత్తలుగా ఎదగాలని దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు , గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రేమ్ సుస్థిర్ మూర్తీజీ , దమ్మపేట పంచాయితీ 6 వ వార్డు మెంబర్ పానుగంటి లక్ష్మణ్ గౌడ్, ప్రిన్సిపాల్ మేడిది వెంకట రత్నం ఆకాంక్షించారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజకవర్గం , దమ్మపేట లోని గీతాంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ,ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేమన్నారు .ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది ,సైన్స్ మాత్రమేనని అన్నారు .భౌతిక శాస్త్రంలో సర్ సి .వి .రామన్ చేసిన అపారమైన సేవలకు,సర్ సి .వి . రామన్ 1928 ఫిబ్రవరి 28న “రామన్ ఎఫెక్ట్ ” కనుగొన్నారు .ఆరోజు గుర్తుగా సాంకేతిక విద్య ,నైపుణ్యాల వృద్ధి ,భవిష్యత్తులో సైన్స్ పరంగా సాధించాల్సిన ప్రగతి పరంగా విద్యార్థులు ,యువతను ప్రోత్సహించడం కోసం ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ డేను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న గీతాంజలి పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం హర్షణీయమన్నారు . సైన్స్ మన భారత దేశ ఆచార సంప్రదాయాలలో సైన్సు దాగి ఉందని ,ప్రతి విద్యార్థి సైన్స్ లో పట్టు సాధించి శాస్త్ర వేత్తలుగా ఎదగాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో గీతాంజలి స్కూల్ ముందువరుసలో ఉంటుందని కొనియాడారు.

పాఠశాలలో విద్యార్థులు సైన్స్ పై చేసిన వివిధ ప్రయోగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేపట్టిన వివిధ రకాల అలంకరణలు చూడముచ్చటగా ఉండడంతో విద్యార్థులను అభినందించి బహుమతులను అందజేశారు .ఈ కార్యక్రమంలో మేడిది రామకృష్ణ ,ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు ,విద్యార్థులు , పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply