Handreeniva | కొట్టుకు వచ్చిన మృత దేహాలు

Handreeniva | కొట్టుకు వచ్చిన మృత దేహాలు

Handreeniva | కొత్తచెరువు, ఆంధ్రప్రభ : హంద్రీనీవా కాలువ ద్వారా నీటిలో రెండు శవాలు కొత్తచెరువు మండలంలోకి కొట్టుకొచ్చాయి. కొత్తచెరువు మండల పరిధిలోని పోతులకుంట గ్రామ సమీపంలో గ ల హంద్రీనీవా కాలవలో రెండు శవాలు వస్తున్న విషయాన్ని గ్రామస్తులు గమనించి పోలీసులకు చేరవేశారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున రెండు శవాలను ఇంతవరకు బయటకు తీయలేదు.

రెండు మృతదేహాలు ప్రస్తుత ప్రశాంతి రైల్వే స్టేషన్ సమీపంలోని హంద్రీనీవా కాలవలో ఉన్నాయి. మహిళా, పురుష మృతదేహాలు కాలవలో వస్తుండడంతో ఇద్దరు భార్యాభర్తలు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు బయటకు తీసిన తర్వాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.

Leave a Reply